మహిళ టి-20లో ఆమెదే అత్యధిక స్కోరు

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ హీలీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన మూడు టి20 సిరీస్ లో భాగంగా ఆఖరి మ్యాచ్లో హీలి 61 బంతుల్లో 148 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. 46 బంతుల్లోనే సెంచరీ చేయడంతో వేగంగా సెంచరీ చేసిన రెండో మహిళా క్రికెటర్ గా రికార్డులకెక్కింది. 148 పరుగులు చేయడంతో ఒకే మ్యాచ్ లో ఎక్కువ పరుగులు చేసిన మహిళా క్రికెటర్ గా రికార్డు నమోదు చేసింది . ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక 94 పరుగులు మాత్రమే చేయగలిగింది. 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *