Category: National

కుమారస్వామి చివరి సంతకం పై రైతుల హర్షం

కుమారస్వామి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వార్షిక ఆదాయం లక్ష కంటే తక్కువ ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తాను అని హామీ ఇచ్చారు. ఆ విధంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి విడత రుణమాఫీ చేసారు . బలనిరూపణ తమను వ్యతిరేకంగా వుంటుందని ముందుగా పసిగట్టిన కుమారస్వామి బలనిరూపణ కి వెళ్లేముందు చివరి విడత రుణమాఫీ పై సంతకం చేసి ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు . కుమారస్వామి చేసిన రుణమాఫీ పై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆరు ఓట్లు తేడాతో కూలిన కుమారస్వామి ప్రభుత్వం

నాలుగు రోజులు నుంచి తీవ్ర ఉత్కంఠ రేపిన కర్ణాటక అసెంబ్లీ హై డ్రామా నేటితో ముగిసింది . సంఖ్య బలంపై ఓటింగ్ నిర్వహించిన స్పీకర్ రమేష్ అసెంబ్లీ అధికారులు ద్వారా సభలో వున్న ఎమ్మెల్యేలు దగ్గరకి వెళ్లి ఓటింగ్ తీసుకున్నారు. ప్రభుత్వానికి 99 అనుకూలమైన ఓట్లు వచ్చాయి మ్యాజిక్ ఫిగర్ 105 రావాలి అందుచేత 6 ఓట్లు తేడాతో కుమారస్వామి ప్రభుత్వం కోల్పోయింది. 107 అనుకూల ఓట్లతో బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది . స్పీకర్

ఆస్ట్రేలియాను భయపెట్టిన మన చంద్రాయన్

ఇస్రో నిన్న ప్రయోగించిన చంద్రాయన్ 2 ఆస్ట్రేలియా ప్రజలను భయపెట్టింది . ఇక్కడ మధ్యాహ్నం 2.45 బయలు దేరిన చంద్రాయన్ ఆస్ట్రేలియా వాళ్లకి అది నైట్ 8.30 మధ్య టైంలో ఆకాశం నుంచి ఏదో కాంతి వాళ్ల వైపు వస్తున్నట్లు ఆందోళన చెందారు. ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. అక్కడ ప్రభుత్వం అది భారత్ ప్రయోగించిన చంద్రాయన్ 2 భయపడ వలసిన అవసరం లేదని తెలియజేసారు. https://m.facebook.com/ABCNorthWestQLD/photos/a.692957074051092/2904165002930277/?type=3

చంద్రాయన్ 2 కోసం ఏపీ విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు

మరికాసేపట్లో ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రాయన్ 2 కాసేపట్లో నిగులోకి ఎగరనుంది . చంద్రాయన్ 2 విద్యార్థులు అందరు వీక్షిణచే విధంగా చూడాలని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక డిజిటల్ వీడియో బాక్స్లు సెటప్ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి . ఈ మేరకు కు ప్రతి స్కూల్లో డిజిటల్ వీడియో బాక్సులు సెట్ చేస్తున్నారు. డిజిటల్ వీడియో బాక్స్ లేని స్కూల్లో ప్రత్యామ్నాయం ఏర్పాట్లు

హర్యానాలో శిశువును కాపాడిన కుక్క

హర్యానాలో ఒక శిశువును కుక్క కాపాడింది అప్పుడే పుట్టిన శిశువును ఒక ఆవిడ ప్లాస్టిక్ కవర్ లో కట్టి మురికి కాలువల్లో పడేసింది ఇది గమంచిన కుక్క మురికి కాలువ నుంచి కవర్ ను రోడ్డు పైకి తీసుకువచ్చింది . జనం ఇది గమనించి శిశువును బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు . పోలీసులు శిశువును శిశు సంక్షేమ అధికారులకు అందజేసి ఆమె తల్లి కి వెతుకుతున్నారు. కుక్క చేసిన పనిని అక్కడ జనం మెచ్చుకుంటున్నారు
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి