స్మిత్ రీఎంట్రీ తో అవమానింపబడ్డ చోట కీర్తింపబడ్డాడు

సరిగా ఏడాది క్రితం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తమ ప్రదర్శన తో ఆశ్చర్యానికి గురి చేసారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు . మంచి అయితే అభిమానులు చప్పట్లు కొట్టి అభిమానించేవాళ్లు కానీ వాళ్లు చేసింది బాల్ ట్యాపరింగ్ కనుక అభిమానులు ఆవేశం వ్యక్తం చేస్తూ తమ ఆగ్రహం వ్యక్తంచేశారు ఇంకా వ్యక్తం చేస్తున్నారు ట్రోల్స్ చేస్తున్నారు .

ఇంతకీ ఏమి జరిగింది అంటే ఏడాది క్రితం సౌత్ ఆఫ్రికా తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు రెండో ఇనింగ్స్ లో బాల్ ట్యాపరింగ్ కి చేసారు . ఇంచ్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం టీవీ కెమెరాలు లో కనపడతున్న ఏమి బెదరకుండా తమ పని కనిచేశారు .

ప్రూఫ్స్ తో దొరికిపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్,వైస్ కెప్టెన్ వార్నర్,బౌలర్ బ్రోచర్ పై ఏడాది పాటు నిషేధం విధించింది .

క్రికెట్ అభిమానులు అందరు స్మిత్, వార్నర్ ను ఒక రేంజ్లో ట్రోల్ చేసారు ఇప్పటికి చేస్తూ వున్నారు. ఈ యాషెస్ సిరీస్ లో అయిత్ ఇంగ్లాడ్ అభిమానులు స్మిత్,వార్నర్ మస్కలు ధరించి గ్రౌండ్లో ట్రోల్ చేసారు.

వార్నర్ ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ లో రాణించలేకపోయిన స్మిత్ మాత్రం ప్రేక్షకుల హృదయాలను గెల్చుకున్నాడు అవమనిపబడిన చోట నిలబడ్డాడు అని చెప్పుకోవాలి ఆస్ట్రేలియా అభిమానులు చేత కీర్తింపబడుతున్నాడు .

ఇంగ్లాడ్ బౌలర్లు దాటికి మొదటి టెస్ట్ మొదటి ఇనింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాట్సమెన్స్ పెవిలియన్ కి క్యూ కడుతున్న సమయంలో స్మిత్ లోయర్ ఆర్డర్ తో కలిసి ఆస్ట్రేలియా జట్టు ను పటిష్ట స్థాయిలో నిలిపాడు.

మొదటి ఇనింగ్స్ లో 144 సెకండ్ ఇనింగ్స్ లో 142 పరుగులు చేసి ఆస్ట్రేలియా ని విజయం వైపు నడిపిస్తున్నాడు .

చివరి రోజు ఇంగ్లాడ్ విజయానికి 385 పరుగులు సాధించాలి.

READ  ఒకవేళ ఇండియా-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ కి వర్షం వస్తే
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి