భారత్ ఈ మ్యాచ్ లో గెలిస్తే

వరల్డ్ కప్ లో భారత్ ఈరోజు తన చివరి లీగ్ మ్యాచ్ శ్రీలంకతో అడనున్నది . ఇప్పటికే సెమీస్ కి చేరిన భారత్ ఈ మ్యాచ్ గెలుపు తో సెమీస్ లో ప్రత్యర్థిని ఎంచుకోవచ్చు .

భారత్ 8 మ్యాచులు ఆడి 6 మ్యాచ్స్ గెలిచింది . ఒక మ్యాచ్ ఓడి 13 పాయింట్స్ తో రెండో స్థానంలో వుంది . భారత్ ఓడిపోయింది ఇంగ్లాడ్ మీద .ఇంగ్లాడ్ కూడా సెమీస్ కి చేరి 3వ స్థానంలో వుంది.

ఈరోజు మరో మ్యాచ్ ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది . ఆస్ట్రేలియా 8 మ్యాచ్స్ లో 6 విజయాలు ఒక ఓటమితో 14 పాయింట్స్ సాధించి మొదటి స్థానంలో వుంది. ఆస్ట్రేలియా భారత్ పై ఓడిపోయింది.

ఈరోజు మ్యాచ్ లో భారత్ నెగ్గి ఆస్ట్రేలియా ఓడిపోతే భారత్ రెండు పాయింట్స్ సాధించి 15 పాయింట్స్ తో మొదటి స్థానంలో వుంటాది మన సెమీస్ ప్రత్యర్థి నాలుగో స్థానంలో వున్న న్యూజలాండ్ అవుతాది

ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ నెగ్గి భారత్ ఓడిపోతే మన సెమీస్ ప్రత్యర్థి ఇంగ్లాడ్ అవుతాది

ఆస్ట్రేలియా, ఇండియాఈరోజు మ్యాచ్ లో ఓడిపోతే ఎటువంటి మార్పు వుండదు మన ఇండియా ఇంగ్లాడ్ తోను,ఆస్ట్రేలియా న్యూజలాండ్ తో సెమీస్ ఆడతాయి.

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇంగ్లాడ్ తో సెమీస్ ఆడేకన్న న్యూజలాండ్ సెమీస్ ఆడితే ఇండియాకు బెట్టర్

టీం ఇండియా ఈరోజు మిడిల్ ఆర్డర్ లో ప్రయోగాలు చేసే అవకాశం వుంది . టాప్ ఆర్డర్ బాగా రాణిస్తున్న మిడిల్ ఆర్డర్ కాస్త నిరాశపరుస్తుంది. రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశం కల్పించి సీనియర్స్ కి రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

READ  తక్కువ స్కోర్ కి న్యూజిలాండ్ ని కట్టడి చేసిన పాకిస్తాన్
One Comment
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి