ఆస్ట్రేలియా ఓడిపోవడం మనకి మంచిదయింది

ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోవడం భారత్ కు మంచిదయింది .

ఈ మ్యాచ్ వరకు పాయింట్స్ పట్టికలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఇండియా రెండో స్థానంలో వుండేవి.

మొదటి స్థానంలో వున్న జట్టు ,నాల్గోన స్థానంలో వున్న జట్టుతో సెమీస్ ఆడాలి మరియు రెండో స్థానంలో ఉన్న జట్టు మూడో స్థానంలో జట్టుతో ఆడాలి .

మూడు ,నాలుగు స్థానాల్లో ఇంగ్లాండ్,న్యూజిల్యాండ్ ఉన్నాయి కనుక ఇండియా ,ఇంగ్లాడ్ తో సెమీస్ ఆడవలసి వచ్చేది.

భారత్ ఈ వరల్డ్ కప్ లీగ్ లో ఓడిపోయిన ఏకైక మ్యాచ్ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ .

ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో 337 పరుగులు చేయగా. ఇండియా 306 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 36 పరుగుల ఆధిక్యంతో గెలిచింది .

భారత్ సెమీస్ లో ఇంగ్లాండ్ తో తలబడి ఉంటే భారత్ పై ఒత్తిడి ఉంటుంది కనుక భారత్ ఈ మ్యాచ్లో గెలవడం కొంచెం కష్టంగా ఉంటుంది.

ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలవడం వల్ల భారత్ సెమిస్ న్యూజిలాండ్ తో ఆడే ఛాన్స్ వచ్చింది .

ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్లో మొదటి దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది.

కెప్టెన్ డూ ప్లేసెస్ సెంచరీ ,కీపర్ డికాక్ అర్థ సెంచరీ, దూసేన్ 95 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 325 పరుగులు చేసింది.

325 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా 315 పరుగులు మాత్రమే చేయగలిగింది .

డేవిడ్ వార్నర్ 125 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన మిగతా బ్యాట్స్ మెన్స్ ఎవరు తనకు సహకరించలేదు. క్యారీ ధాటిగా ఆడి 63 బంతుల్లో 85 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా విజయావకాశాలపై ఆశ చిగురించిన

దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి 315 పరుగులకు ఆలౌట్ కావడంతో 9 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలిచింది

ఇంతకు ముందు జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది శ్రీలంక 264 పరుగులు చేయగా భారత లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 43 ఓవర్లు లో సాధించింది

రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 103 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించాడు.

ఈ మ్యాచ్ల గెలుపు ఓటములు వల్ల పాయింట్స్ టేబుల్స్ లో మొదటి రెండు స్థానాల్లో భారత్ ఆస్ట్రేలియా నిలిచాయి.

భారత్ న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ తో సెమిస్ ఆడతాయి.

READ  నిజంగా ధోని అవుటైన బాల్ నోబాల్

ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగే సెమిస్ మ్యాచ్ భారత్-పాక్ మంచి రసవంతంగా ఉంటుంది కనుక అభిమానులకు పండగే అని చెప్పుకోవాలి .

error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి